ఆడాలంటే బుర్ఖా వేసుకోవాలన్నారు.. అందుకే.. - సౌమ్యా స్వామినాథన్

ఆడాలంటే బుర్ఖా వేసుకోవాలన్నారు.. అందుకే.. - సౌమ్యా స్వామినాథన్

భారత చెస్ క్రీడాకారిణి సౌమ్య స్వామినాథన్ ఇరాన్ టోర్నమెంట్‌ నుంచి తప్పుకుంది. జులై 26 నుంచి ఆగస్టు 4 వరకు జరగాల్సి ఉన్న ఆసియన్ నేషన్స్ కప్ చెస్ ఛాంపియన్ షిప్ 2018లో జాతీయ జట్టు తరపున అర్హత సాధించింది. అయితే ఈ టోర్నీలో ఆడాలంటే ఖచ్చితంగా తలవరకు ముసుగు గానీ లేదా బుర్ఖా గానీ విధిగా ధరించాలని అక్కడి ప్రభుత్వం రూలు పెట్టింది. భారత దేశ పౌరురాలిగా, నా వ్యక్తిగత హక్కులను కాలరాసే నిబంధనకు తాను అంగీకరించలేకపోయానని, అందుకే పోటీ నుంచి నిష్క్రమించానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇలా మత సంబంధిత నియమాలు విధించి క్రీడాకారులకు ఆటంకం కలిగించడం సమంజసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడాకారులు ఎన్నో సందర్భాల్లో సర్థుకుపోతూనే ఈవెంట్లలో పాల్గొంటారని వెల్లడించింది. భారతదేశం తరపున జట్టులో సెలక్ట్ అయినందుకు చాలా గౌరవంగా భావించాను, కానీ ఇలాంటి కారణంతో దూరమవ్వాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది అని వివరించింది. 2106 లో జరిగిన ఏషియన్ ఎయిర్‌గన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సిన హీనా సిద్దూ కూడా ఇదే కారణంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసింది. 

Back to Top