4 దశాబ్దాల తర్వాత సౌదీలో 'ది మెస్సేజ్‌' ప్రదర్శన

4 దశాబ్దాల తర్వాత సౌదీలో 'ది మెస్సేజ్‌' ప్రదర్శన

సౌదీ అరేబియా:సిరియన్‌ అమెరికన్‌ దర్శకుడు ముస్తాఫా అక్కద్‌ రూపొందిన చారిత్రక చిత్రం 'ది మెసేజ్‌' నాలుగు దశాబ్దాల తర్వాత సౌదీ అరేబియాలో ప్రదర్శితం కాబోతోంది. తన తండ్రి రూపొందించిన సినిమా విడుదలవుతున్నందుకు ఆనంంగా వుందని అక్కద్‌ కుమారుడు చెప్పారు. ప్రొఫెట్‌ మొహమ్మద్‌పై తీసిన ఈ సినిమా 1976లో విడుదలై అరబ్‌ ప్రపంచంలో సంచలనమే సృష్టించింది. సినిమా చుట్టూ వివాదాలు రావడంతో, అరబ్‌ ప్రపంచం ఈ సినిమాని బ్యాన్‌ చేసింది. గత ఏడాది సౌదీ అరేబియా సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో, సౌదీ అరేబియాలో సినిమాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. సినిమాపై ఎన్ని వివాదాలున్నా, ఇది ప్రజాదరణ పొందిందని అక్కద్‌ కుమారుడు మాలిక్‌ ముస్తఫా అక్కద్‌ చెప్పారు. 

 

Back to Top