యూఏఈలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ప్రార్ధనా సమయాల ప్రకటన

యూఏఈలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ప్రార్ధనా సమయాల ప్రకటన

ఈద్‌ అల్‌ ఫితర్‌ ప్రార్థనల సమయం ప్రకటితమయ్యింది. అబుదాబీలో ఈద్‌ ప్రార్ధనలు ఉదయం 5.50 నిమిషాలకు జరుగుతాయి. అల్‌ అయిన్‌లో 5.57 నిమిషాలకు, వెస్టర్న్‌ రీజియన్‌లో 6.02 నిమిషాలకు ప్రార్థనలు జరుగుతాయని అవ్‌కాఫ్‌ వెల్లడించింది. సార్జాలో 5.44 నిమిషాలకు ఈ ప్రార్థనలు జరుగుతాయి. అల్‌ హామ్రియా, అల్‌ మదామ్‌ మరియు మలెహా ప్రాంతంలోనూ ఉదయం 5.44 నిమిషాలకు ప్రార్థనలు జరుగుతాయి. అల్‌ అల్‌ ధైద్‌ సిటీ, అల్‌ బతియా ప్రాంతాల్లో 5.43 నిమిషాలకు, ఈస్టర్న్‌ రీజియన్‌లోని సిటీస్‌ సబర్బన్స్‌లో 5.41 నిమిషాలకు ప్రార్ధనల్ని న్విహిస్తారు. దుబాయ్‌, ఫుజారియా, రస్‌ అల్‌ ఖైమా, ఉమ్‌ అల్‌ ఖైవాన్‌కి సంబంధించి ప్రార్ధనల సమయంపై స్పష్టత రావాల్సి వుంది. 

Back to Top