ఫుడ్ పాయిజన్‌‌‌ అయినప్పుడు పాటించాల్సిన చిట్కాలు....

- June 13, 2018 , by Maagulf
ఫుడ్ పాయిజన్‌‌‌ అయినప్పుడు పాటించాల్సిన చిట్కాలు....

జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతోపాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా పోతోంది. అందువలన కంటికి కనిపించిన హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్లని ఇలా ఎక్కడపడితే అక్కడ ఏది దొరికితే అది ఆరగిస్తూ ఆకలి బాధను తీర్చుకుంటున్నారు.

ఇలా చేయడం వలన చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ బారినపడుతుంటారు. ఇలా జరిగినప్పుడు వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. కాబట్టి వీటినన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే తప్పించుకోవచ్చును. 
 
కడుపులో వికారంగా అనిపించినపుడు కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగితే మంచి ఫలితం లభిస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఆ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి కడుపులో మంటకి మంచిది. పొట్టలో వికారంగా అనిపిస్తునప్పుడు రోజు స్పూన్ తేనెను తీసుకుంటే ఫుడ్ పాయిజన్ నుండి తప్పించుకోవచ్చును.
 
ఫుడ్ పాయజన్ వలన శరీరంలోని పొటాషియం పరిమాణం తగ్గిపోతుంది. అప్పుడు మీరు నీరసంగా కనిపిస్తారు. అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండు తింటే మంచిది. అలాకాకుంటే రెండు అరటి పండ్లను పెస్ట్‌లాచేసుకుని పాలలో కలిపి తీసుకున్నా కూడా ప్రయోజనం ఉంటుంది. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటుంది. అందుచేత ఫుడ్ పాయిజన్ అయిన వ్యక్తి కప్పు పెరుగు తీసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com