బహ్రెయిన్:వీడియో కాల్స్‌ ద్వారా చిన్నారులతో విచారణ

- June 21, 2018 , by Maagulf
బహ్రెయిన్:వీడియో కాల్స్‌ ద్వారా చిన్నారులతో విచారణ

బహ్రెయిన్:చిన్నారుల్ని విచారించడం కోసం వీడియో కాల్‌ విధానాన్ని ఫ్యామిలీ అండ్‌ చైల్డ్‌ ప్రాసిక్యూషన్‌ ప్రారంభించనుంది. వివిధ కేసుల్లో విక్టిమ్స్‌, విట్‌నెస్‌ లేదా సస్పెక్ట్‌ అయి వున్న చిన్నారుల్ని విచారించేందుకోసం ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ డాక్టర్‌ అలీ అల్‌ షువైఖ్‌ చెప్పారు. ఈ విధానం ద్వారా పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గుతుందనీ, ప్రశాంత వాతావరణంలో వారిని విచారించేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. డిఫెన్స్‌ లాయర్లకు సైతం విచారణ తేలికవుతుందని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com