ఫేక్‌ బాంబ్‌: బహ్రెయినీ టీనేజర్‌కి జైలు

- June 22, 2018 , by Maagulf
ఫేక్‌ బాంబ్‌: బహ్రెయినీ టీనేజర్‌కి జైలు

హై క్రిమినల్‌ కోర్టు ఓ బహ్రెయినీ యువకుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన సోదరుడితో కలిసి ఫేక్‌ బాంబు తయారీలో నైపుణ్యం సంపాదించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. 2016, మే 22న జిద్‌ అలి ప్రాంతంలో ఓ డివైజ్‌ని కనుగొన్నారు. ఈ హోక్స్‌ బాంబ్‌ని ప్లాస్టిక్‌ బాక్స్‌తో తయారు చేశారు. ఎంపీ3 గ్యాడ్జెట్‌తో కనెక్ట్‌ చేసి, టేప్‌ చేశారు. ఈ ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. జిద్‌ అలి ప్రాంతంలో ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతంలో ఆ ఫేక్‌ బాంబ్‌ని పెట్టి, జనాన్ని భయపెట్టాలనుకున్నట్టు నిందితుడు తెలిపాడు. తీవ్రవాద భావజాలంతోనే ఈ ఫేక్‌ బాంబ్‌ని నిందితుడు తయారు చేసినట్లు ప్రాసిక్యూటర్స్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com