బీచ్‌ గోయర్స్‌కి ఫుజారియా పోలీసుల హెచ్చరిక

బీచ్‌ గోయర్స్‌కి ఫుజారియా పోలీసుల హెచ్చరిక

ఎమిరేట్‌లోని బీచ్‌ గోయర్స్‌కి ఫుజారియా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంబ్రెల్లా బీచ్‌ జోన్‌లో వాహనాల్ని నడపరాదని ఆ హెచ్చరికలో పేర్కొన్నారు ఫుజారియా పోలీసులు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఫుజారియా పోలీసులు హెచ్చరిక పోస్ట్‌ని వుంచారు. బీచ్‌ గోయర్స్‌ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, పెట్రోల్స్‌ నిత్యం ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంటాయనీ, ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఫుజారియా పోలీస్‌ పేర్కొంది. 1,000 దిర్హామ్‌ల జరీమానా, 8 బ్లాక్‌ పాయింట్స్‌ ఉల్లంఘనులకు తప్పవని, అలాగే ఏడు రోజులపాటు వాహనాన్ని జప్తు చేయడం జరుగుతుందనీ ఫుజారియా పోలీస్‌ స్పష్టం చేసింది.

 

Back to Top