వాట్సాప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్ ఏంటో మీరే చూడండి.

వాట్సాప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్ ఏంటో మీరే చూడండి.

ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం తీసుకురాబోతుంది.
స్టిక్కర్స్
ఇప్పటికే ఎమోజీల రూపంలో అలరిస్తుండగా.. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఉన్న 'స్టిక్కర్స్'ను వాట్సాప్‌లోనూ పెట్టాలని వాట్సాప్ నిర్ణయించింది. మొదట ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఈ వారంలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
బీటా వెర్షన్లలో
ఇప్పటికే ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్లలో పెట్టినా.ప్రస్తుతానికి డిసేబుల్ చేసింది. వారంలో ఎలాగూ ఆండ్రాయిడ్ యూజర్లకు దానిని అందుబాటులోకి తెస్తున్నారు కాబట్టి.. బీటా వెర్షన్‌లోనూ అప్పుడే ఎనేబుల్ చేస్తామని సంస్థ తెలిపింది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాంలో ఈ స్టిక్కర్లకు సంబంధించిన సమాచారాన్ని డబ్ల్యూఏబీటాఇన్ఫో ఉంచింది.
వివిధ రకాల భావోద్వేగాలతో ఈ స్టిక్కర్ ఎమోజీలను క్రియేట్ చేసింది. లోల్, లవ్, సాడ్, వావ్ వంటి నాలుగు రకాల రియాక్షన్లను ఈ ఎమోజీల ద్వారా చెప్పేందుకు వీలు కల్పిస్తోంది. అవేకాకుండా మరిన్ని ఎమోజీలనూ డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.

Back to Top