టార్గెట్ ఈబీ-5

టార్గెట్ ఈబీ-5

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుల కన్ను ఇప్పుడు ఈబీ-5 వీసాలపై పడింది. గత కొన్ని రోజులుగా హెచ్‌-1బీ వీసా విధానాల్లో మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్న ఆయన... తాజాగా ఈబీ-5 వీసాలపై సంస్కరణలు, లేదా ఏకంగా ఎత్తి వేయాలని ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వీసా ద్వారా విదేశీయులు ... యూఎస్ లో కనీసం మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అలాంటి వారికి గ్రీన్‌ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వినియోగం జరుగుతోందని, అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్‌ యంత్రాంగం వాదన. ఈ నేపథ్యంలో ఈబీ-5 వీసా విధానంపై దృష్టి పెట్టారు.
ఈబీ-5 కోసం అప్లై చేసుకున్న దేశాల్లో భారత్ ది మూడోస్థానం. మొదట చైనా, రెండో స్థానంలో వియత్నాం ఉంది. ఈ వీసాను దుర్వినియోగం చేస్తున్నారని చైనాపై ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. గత ఏడాది భారత్ తరఫున 500 ఈబీ-5 వీసా దరఖాస్తులు ఫైల్ అయ్యాయి. ఈ ఏడాది దాదాపు 700 అప్లికేషన్స్ ఫైల్ అయ్యే అయ్యే అవకాశం ఉంది.
ఈబీ-5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీయులకు వీసాలు ఇస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. భారత్ నుంచి కూడా రోజు రోజుకు ఈబీ-5 వీసా కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చండీగఢ్ , పంజాబ్, ఢిల్లీ, ముంబయి, తమిళనాడు, కర్నాటకలో నుంచి ఉన్నారు.2016లో 50 మంది ఆయా రాష్ట్రాల నుంచి ఈబీ-5 వీసా తీసుకోగా.. 2017లో 97 మంది, ఈ ఏడాది 200 మంది వరకు ఉంటారని అంచనా.

Back to Top