బత్తాయి రసం వల్ల ఉపయోగాలు

- June 26, 2018 , by Maagulf
బత్తాయి రసం వల్ల ఉపయోగాలు

బత్తాయి రసంలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. వ్యాధినిరోధన శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. బత్తాయిలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుచుటలో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. 
 
బత్తాయిలో పొటాషియం, పాస్పరస్, మినరల్స్ ఎక్కువగా ఉండడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసుడు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట నుండి ఉపశమనం పొందవచ్చును.
 
రక్తంలోని ఎరుపు కణాలను బత్తాయి వృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. పిల్లలలో పెరుగుదలకు బత్తాయి తోడ్పడుతుంది. వృద్ధుల్లో కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. 30 వేళ్ళు దాటిన మహిళలు రోజు ఒక గ్లాసు బత్తాయి రసం త్రాగితే మంచిది. జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అరగ్లాసు బత్తాయి రసాన్ని తీసుకుంటే మంచిది. బత్తాయిలోని క్యాలరీల బరువును తగ్గించే సూచనలున్నాయి. ఇది కంటికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com