జూన్‌లో 18 శాతం పెరిగిన ప్యాసింజర్‌ ట్రాఫిక్‌

జూన్‌లో 18 శాతం పెరిగిన ప్యాసింజర్‌ ట్రాఫిక్‌

కువైట్‌: డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ 18 శాతం పెరిగింది. 2017 జూన్‌లో 1,034,477 మంది ప్రయాణీకులు నమోదు కాగా, 2018 జూన్‌లో ఇది 1,222,449గా నమోదయ్యింది. 2017 జూన్‌తో పోల్చితే 2018 జూన్‌ నాటికి ప్రయాణీకుల ట్రాఫిక్‌ 505,653కి చేరుకుంది. 2017లో ప్రయాణీకుల ట్రాఫిక్‌ 417,337గా నమోదయ్యింది. డిపార్టింగ్‌ ప్రయాణీకులు 617,140 నుంచి 716,796కి పెరిగారని ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఇమాద్‌ అల్‌ జలావి చెప్పారు. కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మొత్తం విమానాల సంఖ్య 10,071గా నమోదయ్యింది. 2017 జూన్‌లో ఈ సంఖ్య 8,998. 

Back to Top