సలాలా టూరిజం ఫెస్టివల్‌ 2018 ప్రారంభం

- July 11, 2018 , by Maagulf
సలాలా టూరిజం ఫెస్టివల్‌ 2018 ప్రారంభం

మస్కట్‌: సలాలా టూరిజం ఫెస్టివల్‌ 2018 యాక్టివిటీస్‌ ప్రారంభమయ్యాయి. సలాలా మునిసిపాలిటీ రిక్రియేషనల్‌ సెంటర్‌లో ఈ టూరిజం ఫెస్టివల్‌ సందర్శకుల్ని అలరిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఈ ఫెస్టివల్‌ని ఆస్వాదించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం వెల్లడించింది. జూన్‌ 21 నుంచి జులై 3 వరకు దోఫార్‌లో పర్యటించిన టూరిస్టుల సంఖ్య 52,017కి చేరుకుంది. గత ఏడాది ఇదే పీరియడ్‌లో 38,404 మంది టూరిస్టులు వచ్చారు. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది 35.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. సలాలాలో ప్రముఖ నగరమైన దోఫార్‌, ఖరీఫ్‌ సీజన్‌లో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. యాన్యువల్‌ ఖరీఫ్‌ ఫశ్రీస్టివల్‌లో సంప్రదాయ ప్రదర్శనలు, స్థానిక హ్యాండిక్రాఫ్ట్స్‌ని విక్రయించే స్టాల్స్‌, ఒమనీ కలినరీ డిలైట్స్‌ ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణలు. ఈ ఫెస్టివల్‌ కోసం ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com