నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశంగా 'నైజీరియా'

నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశంగా 'నైజీరియా'

భారతదేశానికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న అపప్రధ తొలగిపోయింది. ప్రపంచంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని నైజీరియా ఆక్రమించింది. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది నిరుపేదలున్న దేశంగా నైజీరియా నిలిచింది. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేకుండా రోజుకు కేవలం 1.9 డాలర్ల కంటే తక్కువ మొత్తంతో జీవనం సాగించే వారిని నిరుపేదలుగా గుర్తిస్తారు. వరల్డ్ పావర్టీ క్లాక్ ఆధారంగా బ్రూకింగ్స్ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 7.06 కోట్ల మంది నిరుపేదలున్నారు.

Back to Top