ఎన్నారై ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్స్‌:యు.ఏ.ఈకి చెందిన నలుగురు ఇండియన్లకు చోటు

- July 16, 2018 , by Maagulf
ఎన్నారై ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్స్‌:యు.ఏ.ఈకి చెందిన నలుగురు ఇండియన్లకు చోటు

యు.ఏ.ఈ కి చెందిన భారతీయ వలసదారులకు 2018 ఎన్‌ఆర్‌ఐ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాలు దక్కాయి. మొత్తం 11,500 గ్లోబల్‌ నామినీస్‌లో భారతీయ వలసదారులకు చోటు దక్కడం గమనార్హం. అమితేష్‌ పౌల్‌, జోగిరాజ్‌ సికిదార్‌, వర్దరాజ్‌ షెట్టి, ప్రశాంత్‌ మంఘ్‌తా 'మేక్‌ ఇండియా ప్రౌడ్‌'గా నిలిచారు. ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలు, స్వదేశానికి దూరంగా విదేశాల్లో భారతీయతకు సరికొత్త గౌరవం తెచిచనవారిగా వీరిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఆఫ్‌ ది ఇయర్‌ పేరుతో వరుసగా ఇది ఐదో ఏడాది పురస్కారాల ప్రధానం కావడం గమనార్హం. టైమ్స్‌ నౌ, ఐసీఐసీఐ బ్యాంక్‌, గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సహకారంతో ఈ పురస్కారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ పురస్కారాలను అందుకున్నవారి సంఖ్య తాజా లిస్ట్‌తో 19కి చేరుకోనుంది. ఇదిలా వుంటే 2018 ఏడాదికిగాను 22 మంది ఎన్నారైలకు పురస్కారం దక్కగా, ఇందులో ఐదుగురు మిడిల్‌ ఈస్ట్‌కి చెందినవారు. ఇందులో నలుగురు యూఏఈలో నివసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com