భాగ్యనగరంలో లిక్కర్ చాక్లెట్లు.. నగర విద్యార్థులే టార్గెట్

- July 17, 2018 , by Maagulf
భాగ్యనగరంలో లిక్కర్ చాక్లెట్లు.. నగర విద్యార్థులే టార్గెట్

డబ్బు సంపాదించాలి. అక్రమంగా, అన్యాయంగా.. ఎవరి జీవితాలతో మనకి పనిలేదు. అందునా భావి భారత పౌరులే వారి టార్గెట్. అభం శుభం తెలియని చిన్నారులను ఇలాంటి అన్యాయాలకు బలి చేస్తున్నారు.  చిన్నారులకు ఇష్టమైన చాక్లెట్లనే ఎరగా వేసి దందా సాగిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని హైదరాబాద్ నగరంలో లిక్కర్ చాక్లెట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పైకి మామూలు దుకాణంలానే కనిపిస్తుంది. కానీ లోపల జరిగే దందా వేరేగా ఉంటుంది. లిక్కర్ చాక్లెట్ల వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారు. 

వీటికి విస్కీ, రమ్ము అంటూ బ్రాండ్ పేర్లు పెట్టి మరీ వ్యాపారం జరుపుతున్నారు. ఇవే కాకుండా బ్లెండర్ స్పైడ్, బాంబే సాప్పేర్ జిన్, వైట్ మిషెప్ ఒడ్కా వంటి పేర్లతో కూడా చాక్లెట్లను తయారు చేస్తోంది ఈ ముఠా. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అబిడ్స్, బేగం బజార్, బంజారా హిల్స్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్‌తో పాటు మరికొన్ని చోట్ల దాడులు జరిపి ముఠా గుట్టుని బట్టబయలు చేశారు. నగరంలోని పలు స్కూల్ విద్యార్థులు ఈ చాక్లెట్ల మత్తులో పడిపోతున్నారని పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తనిఖీల్లో సీజ్ చేసిన చాక్లెట్ల విలువ భారీగానే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com