రియాద్ లో వ్యక్తి హత్య కేసు..ఐదుగురిని ఉరితీశారు

- July 17, 2018 , by Maagulf
రియాద్ లో వ్యక్తి హత్య కేసు..ఐదుగురిని ఉరితీశారు

రియాద్: వేర్‌హౌజ్ గార్డు హత్య కేసులో దోషులను సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరితీసింది. ఐదుగురిలో ఇద్దరు సౌదీ అరేబియా దేశస్థులు కాగా..ముగ్గురు చాద్ దేశస్థులున్నారు. ఐదుగురు వ్యక్తులు జెడ్డాలో పాకిస్థాన్ వేర్‌హౌజ్ గార్డుపై దాడి చేసి..అతని మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి అరస్టైన ఐదుగురు దోషులను ఉరి తీశామని సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సాదీలో సాధారణంగా ఉరిశిక్ష బహిరంగంగా అమలు చేస్తుంటారు. అయితే దోషులు ఎక్కడ, ఎప్పుడు ఈ నేరం చేశారు.. వారిని ఎక్కడ ఉరితీశారనే విషయంపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. 2018లో సౌదీ ప్రభుత్వం 64 మందికి ఉరిశిక్ష అమలు చేసింది. 2017లో 122 మంది, 2016లో 144 మందిని ఉరితీసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com