గుమ్మడికాయను తీసుకుంటే? జీర్ణవ్యవస్థకు?

- July 17, 2018 , by Maagulf
గుమ్మడికాయను తీసుకుంటే? జీర్ణవ్యవస్థకు?

సాంబార్, రసం వంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే ఈ గుమ్మడికాయ. దీనిలో పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ చాలా ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా జీర్ణమయ్యే పదార్థం కుడా. దీన్ని గుజ్జుగా చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు. 

కూరగానో లేదా సాంబార్‌గానో వాడే ఈ గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కారణంగా గుమ్మడికాయ వ్యాధినిరోధకశక్తిని గణనీయంగా పెంచుటలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్, అధికంగా ఉంటాయి. కాయభాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com