ప్రతిరోజూ లెమన్ టీ తీసుకుంటే?

- July 18, 2018 , by Maagulf
ప్రతిరోజూ లెమన్ టీ తీసుకుంటే?

అలవాటు కొద్ది కాస్త నీరసంగా అనిపించిన ప్రతిసారీ ఎక్కువ క్యాలరీలు ఉండే ఘనపదార్థాలను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీ, బ్లాక్ టీ, కాఫీ వంటి ద్రవపదార్థాలకు తీసుకోకూడదు. బ్లాక్ టీలో స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. లెమన్ టీ లోని ఔషధ విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్ అత్యంత సూక్షమైన పోషకాలు కలిగిఉంటుంది.

ప్రత్యేకించి లెమన్ టీలోని పాస్ట్ ప్రాణశక్తిని, జీవక్రియను, జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. దీనికి మెదడు పనితీరును పెంచడంతో పాటు, కొలెస్ట్రాల్ నిలువల్ని తగ్గించడం ద్వారా రక్తప్రసరణను పెంచుతుంది. లెమన్ టీ మీ జీవితంలో భాగంగా మారిపోయాక శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవలీలగా సంగ్రహించే సామర్థ్యం పెరుగుతుంది.
 
లెమన్ టీలోని శక్తిమూలకాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, గొప్ప కార్యదీక్షతను ప్రసాదిస్తాయి. ఎక్కువ మోతాదులో పనిచేసేవారికి నిద్ర వస్తుంటుంది. అటువంటి వారు లెమన్ టీ తీసుకుంటే మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు చాలా దోహదపడుతుంది. రక్తప్రసరణను పెంచుటలో మంచి ఔషధం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com