మరో నెల రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు

- July 18, 2018 , by Maagulf
మరో నెల రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు

థాయ్‌లాండ్‌ థామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ మీడియాతో మాట్లాడారు. చిన్నారులు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలసి మాట్లాడారు. గుహలో తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందరికి నమస్కారం చెబుతూ, ఫుట్‌బాల్ చేతిలో పట్టుకొని వేదికగా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కొద్ది సేపు ఫుట్‌బాల్‌ ఆడారు. వారు సరాదాగా ఫుట్‌బాల్‌ ఆడిన వీడియో వైరల్‌గా మారింది. 

చిన్నారులతో పాటు వారి కోచ్‌ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. వారందరి బరువు సరాసరిగా 3 కేజీలు పెరిగినట్టు తెలిపారు. మరోవైపు వైద్యులు సూచించిన ప్రశ్నలను మాత్రమే అడిగేందుకు అనుమతించారు. వారందరి మానసిక సమతుల్యత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చికిత్స ముగియడంతో అందరినీ ఇళ్లకు పంపించారు. బాలలను, వారి తల్లిదండ్రులను మరో నెల రోజుల వరకు మీడియాలో మాట్లాడకూడదని చెప్పి పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com