పచ్చిమామిడి కాయను తరచుగా తీసుకుంటే?

- July 28, 2018 , by Maagulf
పచ్చిమామిడి కాయను తరచుగా తీసుకుంటే?

పచ్చిమామిడికాయలు విరివిగా దొరికే కాలమిది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గాను, కూరల్లో గాను చేర్చి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.  

ఎసిడిటీ వలన ఛాతీలో మంటతో కూడిన నొప్పి వస్తుంది. అలాంటప్పుడు పచ్చిమామిడికాయ ముక్కని సన్నగా తరిగి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.గర్భిణులకు వాంతులు, వికారం వలన అసౌకర్యంగా ఉంటుంది. వారు పచ్చిమామిడి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

చాలామందికి మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తరువాత బద్దకంగా అనిపిస్తుంది. అలాంటి వారు పచ్చిమామిడిని తీసుకుంటే చురుగ్గా ఉంటారు. పచ్చిమామిడి తినడం వలన ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. పుల్లటి మామిడి ముక్కల్లో ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాలను దూరం చేసే గుణం ఉంటుంది. 
 
శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు కొత్త రక్తకణాల నిర్మాణానికి దోహదపడుతుంది. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, రక్తం కారడం, పన్ను నొప్పి వంటివి దూరం కావాలంటే మామిడి ముక్కను నమలాలి. దాంతో బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దంతాలు శుభ్రపడుతాయి. పళ్ల మీద ఎనామిల్‌ కూడా దృఢంగా ఉంటుంది. నోటి దుర్వాసనలు దూరమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com