ఇండియా లో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారి కోసం:స్పెషల్ స్టోరీ

- July 30, 2018 , by Maagulf
ఇండియా లో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారి కోసం:స్పెషల్ స్టోరీ

ఆదాయపు పన్ను మదింపు చేసి ఆన్‌లైన్‌లో దాఖలు చేసేముందు కాస్త జాగ్రత్త వహిస్తే పన్ను ఎక్కువ కట్టే బెడదనుంచి తప్పించుకోవచ్చు

1. పొదుపు ఖాతాలో వచ్చిన వడ్డీ
ప్రతి మూడు నెలలకి ఒకసారి మీ పొదుపు ఖాతా అంటే సేవింగ్స్ బ్యాంక్ అక్కౌంట్‌లో ఉన్న డబ్బుపై వడ్డీ వస్తుంటుంది. ఇది కూడా మీ ఆదాయంలో భాగంగానే పరిగణించాలి. ఐతే, సెక్షన్ 80టిటిఏ కింద రూ.10వేలవరకూ ఇలా మినహాయింపు కోరవచ్చు. ఆలాగునే, పోస్టాఫీస్ సేవింగ్స్‌పైన వచ్చే వడ్డీపై కూడా మినహాయింపు పొందవచ్చు

2. అద్దె మినహాయింపు/ హెచ్ఆర్ఏ లేకుండానే
పన్నుచెల్లింపుదారులు హెచ్ఆర్ఏ లేనిపక్షంలో కూడా కడుతున్న అద్దె మొత్తాన్ని మినహాయింపుగా చూపవచ్చు. దీనికోసం సెక్షన్ 80 జిజిని రిఫర్ చేస్తూ ఇలా నెలకి రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.60వేలు మినహాయింపు కోరవచ్చు.

3. ప్రత్యేకించిన వ్యాధులు, జబ్బులు
క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వ్యాధులకు భారీగా ఖర్చు అవుతుంటుంది. అదృష్టవశాత్తూ చాలామందికి ఇలాంటివి రాకూడదనే కోరుకుంటాం కానీ అనూహ్యంగా ఇలాంటి ఖర్చులు వచ్చిపడినప్పుడు సెక్షన్ 80డిడిబి కింద పన్ను చెల్లింపుదారులు మినహాయింపు కోరవచ్చు రూ.40వేల వరకూ అటాక్సియా, ఎయిడ్స్, ప్రమాదకరమైన క్యాన్సర్, డిమెన్షియా కలరా, హెమిబాలిస్మస్, థలసీమియా, తీవ్రమైన కిడ్నీ జబ్బులు పార్కిన్‌సన్స్ వ్యాధి, రక్తహీనత, నరాలు సంబందిత జబ్బులకు అయ్యే ఖర్చులో పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇదే వ్యాధిగ్రస్తులు సీనియర్ సిటిజన్లు అయితే కనుక ఈ మొత్తం రూ.60వేల వరకూ చూపవచ్చు. అదే పన్ను చెల్లింపుదారుడే వ్యాధిగ్రస్తుడై సూపర్ సీనియన్ సిటిజన్ అయితే అంటే 80ఏళ్లు దాటితే రూ.80వేలవరకూ చికిత్స అయిన ఖర్చులో డిడక్షన్ కోరవచ్చు

4. గృహరుణాల మొత్తం/ వడ్డీ చెల్లింపు
సెక్షన్ 80 సి కింద గృహఋణాలపై చెల్లించిన వడ్డీతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్‌ చెల్లింపులను కూడా పన్ను మినహాయింపు జాబితాలో చేర్చవచ్చు అలానే రుణమంజూరు చేసే ప్రాసెసింగ్ ఫీజు కూడా సెక్షన్ 24కింద పన్ను పడని ఆదాయంకింద చూపి ప్రయోజనం పొందవచ్చును.

5. డౌన్‌పేమెంట్ కోసం చేసిన అప్పు
డౌన్ పేమెంట్ కోసం అప్పు చేయడం చాలామంది చేసేదే. ఇలాంటి అప్పును కూడా సెక్షన్ 24 కింద పన్ను ప్రయోజనం కోసం దాఖలు చేయండి. అలానే నిర్మాణం,మరమ్మత్తులు కోసం తెచ్చిన అప్పు, దానిపై వడ్డీపై కూడా ఇలాంటి ప్రయోజనమే తీసుకోవచ్చని చాలామందికి తెలీదు.

6. వైకల్యానికి గురైతే
పన్ను చెల్లింపుదారుడు పాక్షికంగా కానీ..పూర్తిగా కానీ అంగవైకల్యం ఉన్నవారైతే ఆదాయంలోనుంచి రూ.80వేల వరకూ పన్ను పోటు నుంచి తప్పించుకోవడానికి వీలు ఉంది. దీనికోసం సెక్షన్ 80యుని సంప్రదించాలి. అలానే వైకల్యం వలన పెట్టుకున్న సహాయకునికి చెల్లించే మొత్తాన్ని రూ.75వేల వరకూ సెక్షన్ 80డిడి కింద మినహాయింపు పొందే వీలుంది..ఐతే ఇది రెండూ కలిపి రూ.1.25లక్షల వరకూ మాత్రమే..

7. దివ్యాంగుల/ అంగవైకల్యం కలిగినవారి ఆదాయం
కుటుంబంలో ఎవరైనా దివ్యాంగులు ఉన్నట్లైతే..వారి పేరన ఆదాయం వస్తున్నట్లైతే..అలాంటి ఆదాయాన్ని మీ మొత్తం ఆదాయంతో కలిపి లెక్క కట్టాలి. అదే సమయంలో వారి ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు.

8. వ్యాపారంలో నష్టం
ఒకవేళ గత ఆర్ధిక సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడిలో నష్టం వచ్చినట్లైతే, వాటిని కేపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు చూపి ప్రయోజనం పొందాలి.

9. విరాళాలు
సెక్షన్ 80జి కింద ఇచ్చే విరాళాలు కూడా పన్ను మినహాయింపు అర్హత కలిగినవే. ఎంత మొత్తం విరాళం ఇచ్చారో అందులో 50-100శాతం వరకూ మినహాయింపు కోరవచ్చు. ఐతే ఇది మీ మొత్తం ఆదాయంలో పదిశాతానికి మించకూడదనే షరతు ఉంది. ఐతే ఇలా విరాళాలు ఇచ్చేవి కేవలం క్యాష్ లేదంటే డిడిలరూపంలోనే ఉండాలి..విరాళాల విలువ రూ.2వేల మించి కనుక డబ్బు రూపంలో ఇచ్చినట్లైతే ఎలాంటి మినహాయింపు వర్తించదు కాబట్టి..విరాళాలు ఇచ్చేవారు ఈ విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com