బ్రాండ్ బాబు:రివ్యూ

- August 02, 2018 , by Maagulf
బ్రాండ్ బాబు:రివ్యూ

చిత్రం: బ్రాండ్ బాబునటీనటులు: సుమంత్ శైలేంద్ర, ఈషారెబ్బ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులుసంగీతం: జేబీసినిమాటోగ్రఫీ: కార్తీక్ పళణిఎడిటింగ్‌: ఉద్ధవ్ ఎస్‌బీరచన, సమర్పణ: మారుతీనిర్మాత: శైలేంద్రబాబుదర్శకత్వం: పి.ప్రభాకర్‌సంస్థ: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌విడుదల: 03-08-2018 ఓ పాయింట్‌తో కథ అల్లడం బాగానే ఉంటుంది. పాయింట్ కొత్తగా ఉంటే... కొత్త సన్నివేశాలకు ఆస్కారం కనిపిస్తుంది. అయితే.. కేవలం ఒకే ఒక్క అంశం చుట్టూ కథని నడపడం సాధ్యం కాదు. సన్నివేశాల్లో బలం, సంఘర్షణలు లేకపోతే ఎంత మంచి పాయింట్ అయినా తేలిపోతుంది. భలే భలే మగాడివోయ్‌, మహానుభావుడు.. కూడా సింగిల్ పాయింట్‌పై నిర్మించిన చిత్రాలే.కానీ... వినోదమే ప్రధానంగా ఆ చిత్రాలన్నీ అలరించాయి. ఇప్పుడు `బ్రాండ్ బాబు` కూడా అలాంటి కథే. మరి.. ఈ చిత్రం కూడా సదరు చిత్రాల జాబితాల్లో చేరుతుందా?

లేదా? ఇంతకీ ఈ బ్రాండ్ కథేంటి? కథేంటంటే: రత్నం, డైమండ్ (మురళీ శర్మ, శైలేంద్రబాబు) తండ్రీ కొడుకులు. రత్నంకి బ్రాండ్ల పిచ్చి.

వస్తువులపై ఉన్న లోగోకి ఉన్న విలువ మనిషికి ఇవ్వడు. అదే పిచ్చి డైమండ్ బాబుకీ ఉంటుంది. ఎప్పుడూ బ్రాండ్‌... బ్రాండ్ అంటూ దాని వెనకాలే పరుగులు పెడతారు.

తమ హోదాకీ, అభిరుచికి తగిన గొప్పింటి అమ్మాయిని కోడలుగా రావాలన్నది రత్నం ఆలోచన. అయితే.. అనుకోకుండా ఓ పని మనిషి (ఈషారెబ్బా)ని ప్రేమిస్తాడు డైమండ్ బాబు. తాను ప్రేమించిన అమ్మాయి పని మనిషి అన్న విషయం డైమండ్‌ బాబుకు కాస్త ఆలస్యంగా తెలుస్తుంది.

మరి నిజం తెలుసుకున్న డైమండ్ ఏం చేశాడు? తన బ్రాండ్‌కి విలువ ఇచ్చి, ఆ అమ్మాయిని వదిలేశాడా? లేదంటే ఆ అమ్మాయి ప్రేమ కోసం బ్రాండ్‌నే వదిలేశాడా? అనేదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే: ఇది ఓ బ్రాండ్ పై పిచ్చి ఉన్న తండ్రీ కొడుకుల కథ అని చిత్రబృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. దాంతో.. ఎలాంటి సన్నివేశాలు తెరపై చూడబోతున్నామన్న విషయంలో ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేస్తారు. సరిగ్గా అలాంటి సన్నివేశాలే తెరపై కనిపిస్తుంటాయి.

కథని ప్రారంభించిన విధానం, పాత్రల్ని ప్రవేశ పెట్టిన పద్ధతి నచ్చుతాయి. సినిమా టేకాఫ్ సజావుగానే సాగింది. ప్రారంభ సన్నివేశాలు నవ్విస్తాయి. బ్రాండ్ అనే పాయింట్ చుట్టూ కథని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగానూ వాడుకున్నాడు దర్శకుడు.

అయితే... ఎప్పుడైతే ఆ సన్నివేశాలన్నీ అయిపోయాయో అప్పటి నుంచి కథలో చలనం కూడా ఆగిపోతుంది. ఆ తరవాత ఏం చేయాలో తెలీక.. తనకు తెలిసినట్లుగా చేసుకుంటూ వెళ్లాడు.

ఆయా సన్నివేశాలన్నీ వాస్తవాలకు విరుద్ధంగా, లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. హీరో కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేయడం కాస్త అతిగా అనిపిస్తుంది. హీరో కుటుంబ సభ్యుల్లో మార్పు కూడా కృతకంగా అనిపిస్తుంది. `బ్రాండ్ అంటే మనిషి చనిపోయినా చెప్పుకోవాల్సిన పేరు` అనే సందేశం బాగానే ఉన్నా..

దాన్ని ప్రేక్షకులపై బలవంతంగా రుద్దడానికి చేసిన ప్రయత్నాలు మాత్రం మెప్పించవు. సినిమా అంతా `బ్రాండ్‌... బ్రాండ్` అంటూ బ్యాండు వేయడంతో.. ఆ పేరు పలికినప్పుడల్లా ఓ రకమైన అసహనం, విసుగు కలుగుతుంటాయి.

కథలో ఎమోషన్‌, నవ్వులు ఇవన్నీ కృత్రిమంగా అనిపించే సరికి ఏ పాయింట్‌కీ ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వకుండా పోయింది. ఎవరెలా చేశారంటే...: కన్నడలో నటించిన అనుభవం ఉంది శైలేంద్రబాబుకి. తెలుగులో ఇదే తొలి సినిమా. తన పాత్ర వరకూ చక్కగానే చేశాడు.

మంచి ఈజ్ కూడా ఉంది. అయితే... తెలిసిన నటుడైతే ఆ పాత్రకు మరింత ఎలివేషన్ దక్కేది. మురళీశర్మ బాగానే చేసినా..

గత పాత్రల తాలుకు ఛాయలు కనిపించాయి. కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. ఈషారెబ్బా నటన బాగుంది. కాకపోతే..

ఆమె ఎప్పుడూ నీరసంగా కనిపించడంతో గ్లామర్ దెబ్బతింది. సత్యం రాజేష్ పాత్ర ఎందుకు పెట్టారో అర్థం కాదు. జేబీ సంగీతం ఓకే అనిపిస్తుంది. మారుతి అందించిన పాయింట్ బాగుంది.

అది కేవలం కొన్ని సన్నివేశాలకే పనికొచ్చింది. ఆ తరవాత కథలో బలం లేకపోవడంతో నీరస పడిపోయింది. మాటలు అక్కడక్కడ మెరిశాయి. చాలా చోట్ల సహనానికి పరీక్ష పెట్టాయి.

నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. బలాలు + కథలో పాయింట్‌+ ఆరంభ సన్నివేశాలు బలహీనతలు - మిగిలినవన్నీ చివరిగా: బ్రాండ్ బాబు.. ఒకటే బ్యాండు బాబూ గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

మాగల్ఫ్ రేటింగ్: 2.5/5 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com