గూఢచారి:రివ్యూ

- August 03, 2018 , by Maagulf
గూఢచారి:రివ్యూ

సినిమా టైటిల్ : గూఢచారి 
నటీనటులు : అడవి శేష్, శోభిత ధూళిపాళ్ళ , జగపతిబాబు, సుప్రియ, ప్రకాష్ రాజ్ .. తదితరులు 
రచయిత: అడవిశేష్, అబ్బూరి రవి 
సంగీతం : శ్రీచరణ్ 
నిర్మాత : అభిషేక్ పిక్చర్స్ 
దర్సకత్వం: శశి కిరణ్ తిక్క 


రొటీన్ కధలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు సినిమా విజయం సాధించాలంటే కధలో కచ్చితంగా వైవిధ్యం ఉండాల్సిందే. ఈ కోవలో వచ్చే సినిమాలే విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలు విజయం సాధించాలంటే వైవిధ్యం తప్పనిసరి. హీరో అడవి శేష్ కూడా వైవిధ్యలకు ప్రాధాన్యం ఇచ్చే నటుడే. విలన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన నటుడు అడవి శేష్. గత ఏడాది' క్షణం' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది.

ఇప్పుడు వివిధ్యమైన సినిమాతో వచ్చాడు. అదే గూడచారి. ఈ సినిమా ప్రమోషన్ మెటిరియల్ సినిమాపై అంచనాలను పెంచింది. రా ఆఫిసర్ కధ అంటూ ఆసక్తిని రేపారు. టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ చూస్తే అనిపించింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ తొలి హీరోయిన్ సుప్రియ ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం కూడా ఆసక్తకరమైన అంశం. ఇలా మంచి బజ్ తో ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి అనుభూతి మిగిల్చింది? ట్రైలర్ లో చూపించిన థ్రిల్ ని సినిమాలో ఇవ్వగలిగారా ? అసలు ఈ గూడాచారిలో ఏముందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిసిందే.

కధ: ఈ సినిమా ట్రైలర్ లోనే కధను చెప్పే ప్రయత్నం చేశారు. అదే కధను నాలుగు ముక్కల్లో చెప్పుకుంటే గోపి ( అడవిశేష్) తండ్రి ఒక రా అధికారి. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాడు. గోపికి కూడా తన నాన్నల రా ఆఫీసర్ అవ్వాలనే తపన. అయితే రా అధికారిక ఎంపిక ప్రక్రియలో విఫలం అవుతుంటాడు. చివరికి ఇండియన్ గవర్నమెంట్ రహస్యంగా నిర్వహిస్తున్న 'తినేత్ర' అనే ఏజన్సీలో అధికారిగా జాయిన్ అవుతాడు. అక్కడ ఒక మిషన్ లో జాయిన్ అవుతాడు. ఆ మిషన్ లో వుండగా తన జీవితానికి సంబధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అవి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి. చివరికి గోపి కధ ఎలా ముగుస్తుంది ? అతడికి ఇచ్చిన మిషన్ ఏమౌతుందో తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలా వుంది: 
ముందే చెప్పుకున్నాం రొటీన్ కధలకు కాలం చెల్లిపోయిందని.అందుకే ప్రేక్షకులకు త్రిల్ చేయడానికి కొత్త జానర్ ని ఎంచుకున్నాడు దర్శకుడు. పేరులోనే గూడచారి వుంది. ఇది ఓ స్పై థ్రిల్లర్ జోనర్ కి సంబధించిన సినిమా. ఐతే ఇలాంటి సినిమాలు డీల్ చేసినప్పుడు నిర్మాణం పెద్దదిగా వుండాలి. ఒక నేషనల్ సెక్యురిటీ ఏజన్సీకి సంబధించిన కధను చెబుతున్నప్పుడు కాన్వాస్ కూడా అంతే పెద్దదిగా వుండాలి. అయితే అడవి శేష్ మార్కెట్ ని పట్టించుకోకుండా ఈ సినిమాని తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు అభినందనలు చెప్పాలి. ఒక కొత్త కధను చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో విజయం సాధించారు కూడా. కధను చాలా గ్రిప్పింగ్ గా నడిపారు.

దర్శకుడు శశి కిరణ్ కి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభవం వున్న దర్శకుడిగా ఈ సినిమాని తెరక్కించాడు. తొలిసగం మంచి గ్రిప్పింగ్ గా కధను నడిపారు. అయితే సెకెండ్ హాఫ్ లో కధ అక్కడక్కడ నత్త నడక సాగింది. అయితే ఈ జోనర్ సినిమాలను ఆశించే వారికి అది కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్ళీ కధలో వేగం పెరిగింది. మంచి నోట్ తో సినిమా ముగుస్తుంది.

ఎవరెలా చేశారు? 
అడివి శేష్ ఈ కధ సరిగ్గా నప్పింది. చాలా ఏజ్ తో చేశాడు. ఇలాంటి కధను ఎంచుకోవడం సాహసమే. అయితే ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలన్న సంకల్పంను అభినందించాలి. హీరోయిన్ గా చేసిన శోభిత తెలుగమ్మాయే . ఇది వరకే బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేసింది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. పాత్రకు తగ్గటు చేసింది. ఆమె హావాబావలు బావున్నాయి. గ్లామర్ కూడా. స్క్రిప్ట్ ఓరియంటడ్ పాత్రలకు ఆమె బెస్ట్ చాయిస్ కావచ్చు. ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. జగపతిబాబు పాత్ర ఎంట్రీ తో ఈ సినిమా కీలక మలపు తీసుకుటుంది. ఆయన పాత్రను చుపించిన విధానం ఆకట్టుకుంది. సుప్రియ తన పరిధిమేరకు చేసింది.

మంచి ఫోటోగ్రఫీ కుదిరింది. శ్రీచరణ్ అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడ తడబడలేదు. తొలిసినిమాకి అతడికి పాస్ మార్కులు పడతాయి. ఇలాంటి డిఫరెంట్ జోనర్ సినిమా నిర్మాణనికి ముందుకు వచ్చిన అభిషేక్ పిక్చర్స్ సంస్థకు అభినందించాలి. మార్కెట్ గురించి అలోచించకుండా మంచి సినిమా తీయాలనే తపన కనిపించింది.

చివరిగా.. 'గూఢచారి' స్పై జోనర్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాడు.

మాగల్ఫ్ రేటింగ్: 3.25/ 5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com