ఇందులో అనుష్క తప్పేమీ లేదు - బీసీసీఐ

- August 09, 2018 , by Maagulf
ఇందులో అనుష్క తప్పేమీ లేదు - బీసీసీఐ

విరుష్క పేరుతో కరిష్మటిక్ జోడీ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది. క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, గ్లామర్ హీరోయిన్ అనుష్క శర్మల జంటకు ఫాలోయింగ్ ఎక్కువ కనుక.. వాళ్ళ మీద మీడియాలో వేలంవెర్రి కూడా అంతే సహజం. కానీ.. ఆ వెసులుబాటును దుర్వినియోగం చేసుకోవడం దగ్గరే చిక్కులొచ్చి పడేది. ఇదే కోవలో అనుష్క తాజాగా ఒక వివాదంలో ఫిక్స్ అయ్యింది.

లండన్లో ఇండియన్ రాయబార కార్యాలయం వాళ్ళు టీమిండియా కోసం ఒక గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇండియా క్రికెట్ టీమ్‌తో కలిసి డిన్నర్ చేసి, పిచ్చాపాటీ ముగించుకుని ఒక గ్రూప్ ఫోటోకి ఫోజులిచ్చారు హైకమిషన్ సిబ్బంది. ఇంతవరకూ బాగానే వుంది. సదరు ఫోటోలో తగుదునమ్మా అంటూ అనుష్క శర్మ వచ్చి నిలబడింది. మిగతా ఆటగాళ్లను వెనక్కు నెట్టి మరీ.. 'ప్రియమైన మొగుడి' పక్కన ఫోజులిచ్చింది అనుష్క. ఈ ఫోటోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ట్రోలింగ్ షురూ మొదలైంది. టీమిండియా పరువు పోయిందని, ప్రోటోకాల్ బద్దలైందని.. అసలా అమ్మడికి అక్కడేం పని అని.. రకరకాలుగా ఎక్కితొక్కేస్తున్నారు నెటిజనం.
 
చివరకు బీసీసీఐ అధికారులే దిగొచ్చి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 'రాయబార కార్యాలయం ఆహ్వానం మేరకే ఆమె అక్కడకు వెళ్ళింది. క్రికెటర్లతో పాటు వాళ్ల బంధువులకు కూడా హైకమిషన్ నుంచి పిలుపులొచ్చాయి. ఇది అనధికార భేటీ కనుక.. బంధుమిత్రులు పాల్గొంటే తప్పు లేదు." అంటూ సర్ది చెప్పుకుంది బీసీసీఐ. అయినా.. పెళ్ళాల్ని, ప్రియురాళ్లని వెంట తీసుకురాకూడదన్న నిబంధన ఎక్కడికి పోయింది.. అనుష్కను భుజానెక్కించుకుని తిరిగేస్తున్న కోహ్లీకి సిగ్గు లేదా అనే విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com