ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్న నీరవ్

ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్న నీరవ్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ. 7 వేల దాకా టోపీ పెట్టి వెళ్లిపోయిన నీరవ్ మోడీ... ఈడీ, ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్నాడు. తాజాగా అతను దుబాయిలో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. కానీ అతనున్న స్థావరం గుర్తించి పట్టుకునే పక్కా సమాచారం మాత్రం చిక్కడం లేదు. దుబాయిలో ఆరా తీసే సమయానికే ఈజిప్టుకు చెక్కేసినట్టు మరో సమాచారం అందింది. దీంతో నీరవ్ జాడను కరెక్టుగా కనుక్కోవడం కష్టతరంగా మారింది. ఒకవేళ మోడీని బహిష్కరించాలని ఆయా దేశాలకు రిక్వెస్టు చేద్దామంటే అందుకు న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఈడీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Back to Top