మరోసారి కంపించిన ఇండోనేషియా

మరోసారి కంపించిన ఇండోనేషియా

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. నాలుగు రోజుల క్రితం ఇండోనేషియాలోని లాంబోక్‌ ద్వీపంలో వచ్చిన భారీ భూకంపం ఇండోనేషియాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ప్రభావం నుంచి తేరుకోకముందే ఈ రోజు ఉదయం లాంబోక్‌లో మళ్లీ భూమి కంపించింది. అమెరికా జియోలాజికల్‌ సర్వే రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించిందని వెల్లడించింది. నేటి భూకంపం కారణంగా వాహనాలు కింద పడిపోయాయని, కొన్ని భవనాల గోడలు కూలిపోయాయని, ప్రజలు భయంతో పరుగులు తీశారని వెల్లడించారు.

Back to Top