దుబాయ్‌లో బ్రిటిష్ టూరిస్ట్ అతివేగం..రూ.31 లక్షల జరిమానా

దుబాయ్‌లో బ్రిటిష్ టూరిస్ట్ అతివేగం..రూ.31 లక్షల జరిమానా

దుబాయ్: బ్రిటిష్ టూరిస్ట్ ఒకరు దుబాయ్‌లో తన కారును అత్యంత వేగంగా నడపడంతో స్థానిక పోలీసులు అతనికి రూ.30 లక్షలకు పైగా జరిమానా విధించారు. దుబాయ్ అంటే మనకు ఆకాశహర్మ్యాలు, ఎత్తైన భవనాలు, అందమైన రోడ్లు కనిపిస్తాయి. ఈ రోడ్లపై నిబంధనలకు మించి వేగంగా దూసుకెళ్లిన విదేశీయుడికి భారీ జరిమానా పడింది.

ఇటీవల 25 ఏళ్ల బ్రిటిష్ యువకుడు దుబాయ్‌లో లంబోర్గిణి హరికేన్ కారును రెండు రోజులకు గాను రూ.1 లక్ష చెల్లించి అద్దెకు తీసుకున్నాడు. అథని పాస్ పోర్టును అద్దెకు ఇచ్చే ఏజెన్సీ దగ్గర పెట్టుకుంది. దుబాయ్ రోడ్లపై చక్కర్లు కొట్టాడు. కానీ నిబంధనల గురించి తెలియదు. అయితే అత్యాధునిక స్పీడ్ కెమెరాల కంటికి చిక్కాడు.

ఆ బ్రిటిష్ యువకుడి కారు పరిమిత వేగం దాటినప్పుడల్లా ఆ కారు ఖాతాకు జరిమానాలు పడ్డాయి. అలా నాలుగు గంటల్లో ఏకంగా రూ.47వేల డాలర్లు మన రూపాయల్లో రూ.31 లక్షలకు పైగా చెల్లించాడు. షేక్ జాయెద్ రోడ్డుపై వెళ్లాల్సిన వేగం కంటే వెళ్తూ 32సార్లు కెమెరా కంటికి చిక్కాడు. మరో రోడ్డుపై అలాగే వెళ్లాడు.

దీంతో పోలీసులు కారు అద్దెకు ఇచ్చిన యజమానిని సంప్రదించారు. అతని పాస్ పోర్టు ఆధారంగా బ్రిటిష్ ఎంబసీని సంప్రదించారు. ఈ విషయాన్ని బ్రిటిష్ ఎంబసీకి కూడా చెప్పారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే ఖరీదైన విదేశీ కార్లు దుబాయ్‌లో ఉంటాయి. వీధి వీధిలో సూపర్ కార్లు కనిపిస్తాయి. అత్యంత వేగంగా వెళ్లే బుగాటి, లంబోర్గిణి హరికేన్ తదితర విదేశీ కార్ల వల్ల దుబాయ్ పోలీసులకు ట్రాఫిక్‌ను అదుపులో ఉంచడం కష్టమవుతోంది. వాటి వేగ నియంత్రణకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అత్యంత కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయి.

Back to Top