భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్

భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్

హైదరాబాద్:అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం భాగ్యనగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాత్రి 10 గంటల వరకు 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో నగరంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళా ఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

 

Back to Top