కేవలం వాట్సాప్ ఒక్కటే కాదు..

- August 09, 2018 , by Maagulf
కేవలం వాట్సాప్ ఒక్కటే కాదు..

ఇప్పట్లో మొబైల్‌ లేని వాళ్లు కనిపించటమే అరుదు. అందునా మొబైల్‌ ఉన్న వాళ్లలో వాట్సప్‌ అంటే తెలియనివాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మొదట్లో కేవలం చాటింగ్ కోసం మాత్రమే ఉపయోపడే వాట్సప్‌ క్రమంగా వీడియోలు, ఫోటోలు, పంపించుకోవడం వంటి ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే అది కూడా అయిపోయి ప్రస్తుతం ఆడియో, వీడియో కాలింగ్ వంటి ఆప్షన్స్ తో.. వాడకంలో ముందంజలో ఉంది. అయితే అన్ని బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో వచ్చే ‘కంటెంట్ గోప్యత’ వినియోగదారులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. సంస్థ డెవలపర్స్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ ను అప్‌ గ్రేడ్‌ చేస్తున్నా.. ఫేక్ సమాచారం చక్కర్లు కొడుతూనే ఉంది.

అయితే వాట్సప్‌కు ధీటుగా ఎన్నో ప్రముఖ యాప్‌లు అందుబాటులో ఉన్నాయంటున్నారు టెకీ నిపుణులు. సమాచార గోప్యతకు అవి కూడా ఉపయోగపడొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి యాప్‌లలో హైక్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌, వీచాట్, వైబర్‌, లైన్‌ మొదలైనవి ఉన్నాయి. కొత్తదనం కోరుకునేవారు ఈ యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని వాడి చూడవచ్చు. గోప్యత విషయంలో వాట్సాప్ కంటే హైక్‌ యాప్‌ ముందు వరుసలో ఉంది . ప్రైవేట్‌ చాట్‌ల సమాచారం కాపాడుకునేందుకు హైక్‌లో పాస్‌వర్డ్‌ విధానం అందుబాటులో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వీచాట్, లైన్‌ లలో ఫేక్ సమాచారం వచ్చే అవకాశాలు తక్కువనే అంటున్నారు. సో.. మార్పు కోరుకునే వారు మిగతా యాప్ లను కూడా వాడి చూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com