ఫేక్‌ మనీ డిపాజిట్‌: వలసదారుడి అరెస్ట్‌

ఫేక్‌ మనీ డిపాజిట్‌: వలసదారుడి అరెస్ట్‌

మస్కట్‌:ఆసియా జాతీయుడొకర్ని ఫేక్‌ మనీ డిపాజిట్‌ చేసేందుకు యత్నించిన కేసులో అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు, ఓ బ్యాంక్‌ ఏటీఎంలో నకిలీ కరెన్సీని డిపాజిట్‌ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ - మస్కట్‌ పోలీస్‌ కమాండ్‌, ఫేక్‌ కరెన్సీ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేయడం జరిగింది. 20 ఒమన్‌ రియాల్స్‌ విలువైన ఫేక్‌ కరెన్సీని మాబెలా ప్రాంతంలోని బ్యాంక్‌ ఏటీఎంలో డిపాజిట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నిందితుడ్ని, జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు. 

 

Back to Top