మహారాష్ట్రలో బ్యాంకు దోపిడి...

- August 14, 2018 , by Maagulf
మహారాష్ట్రలో బ్యాంకు దోపిడి...

తాళాలు పగలగొట్టి, బెదిరించి, కదిలారంటే కాల్చి పారేస్తాం లాంటి దొంగతనాలకు కాలం చెల్లింది. ఇప్పుడంతా ఆన్‌లైన్ దొంగతనాలు. చదువుకున్న చదువుకి ఆధునిక టెక్నాలజీని జోడించి స్మార్ట్‌గా దొంగతనాలు చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా మొత్తం మూటగట్టేస్తున్నారు.

మహారాష్ట్ర పూణేకు చెందిన కాస్మోస్ బ్యాంకు ప్రధాన కార్యాలయం సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.94.5 కోట్లు కొల్లగొట్టారు. ఈనెల 11న బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసిన నిందితులు రూ.78 కోట్లు ఖాళీ చేశారు.

అనంతరం 13న మరో సారి దాడి చేసి రూ. 14 కోట్లు నొక్కేశారు. అంతే కాకుండా నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2.5 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇలా మొత్తం రూ.94.5 కోట్ల నగదును నిందితులు బ్యాంకు నుంచి కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com