బ్రిటన్ పార్లమెంట్ గోడను ఢీ కొట్టిన కారు...

బ్రిటన్ పార్లమెంట్ గోడను ఢీ కొట్టిన కారు...

బ్రిటన్ పార్లమెంట్ రక్షణ గోడను ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో చాలా మంది పాదచారులు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే సదరు కారు డ్రైవర్ కావాలనే పార్లమెంట్ రక్షణ గోడను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అసలు ఢీకొట్టిన కారు ముందు భాగంలో రిజస్ట్రేషన్ నంబర్ కూడా లేనట్లు ఓ మహిళ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఇది ఉగ్రవాద చర్యనా కాదా అన్న విషయంపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.

Back to Top