ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ కన్నుమూత

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ కన్నుమూత

రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్(90) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన టాండన్‌ను చికిత్స నిమిత్తం ఇవాళ ఉదయం రాయ్‌పూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టాండన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్ టాండన్ మృతిపట్ల ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జనసంఘ్ స్థాపించిన సభ్యుల్లో టాండన్ కూడా ఒకరు. బీజేపీలో ఆయన కీలక పదవుల్లో పని చేశారు. పంజాబ్ కు డిప్యూటీ సీఎంగా కూడా సేవలందించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ గా 2014, జులైలో నియామకం అయ్యారు.

Back to Top