5 రోజుల ఈద్‌ మెగా సేల్‌: 75 శాతం డిస్కౌంట్స్‌

5 రోజుల ఈద్‌ మెగా సేల్‌: 75 శాతం డిస్కౌంట్స్‌

దుబాయ్‌:దుబాయ్‌ సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ వీకెండ్‌ ఇటీవల ముగిసిన సంగతి తెల్సిందే. అయితే ఈద్‌ అల్‌ అదా సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆగస్ట్‌ 15 నుంచి ఆగస్ట్‌ 19 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక అమ్మకాలు షాపింగ్‌ ప్రియుల్ని అలరించనున్నాయి. 75 శాతం వరకు డిస్కౌంట్స్‌తో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్‌ షాపింగ్‌ ప్రియుల కోసం సిద్ధమవుతున్నాయి. దుబాయ్‌ వరల్డ్‌ సెంటర్‌లో బిగ్‌ బ్రాండ్స్‌ ఫెస్టివల్‌ సిద్ధమవుతోంది. యూఏఈలో అతి పెద్ద సేల్స్‌ ఈవెంట్స్‌లో ఇదీ ఒకటి కాబోతోంది. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లోని షేక్‌ మక్తౌమ్‌ హాల్‌లో ముందెన్నడూ లేనంత తక్కువ ధరలకు వివిధ ప్రోడక్ట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. షూస్‌, అప్పారెల్స్‌, కాస్మొటిక్స్‌, పెర్‌ఫ్యూమ్స్‌ ప్రధానంగా అతి తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షాపింగ్‌ అందుబాటులో ఉంటుంది. 

Back to Top