దుబాయ్‌ ర్యాఫిల్: 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న ఇండియన్‌

దుబాయ్‌ ర్యాఫిల్: 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న ఇండియన్‌

దుబాయ్‌:దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో 47 ఏళ్ళ భారతీయుడొకరు 1 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని గెల్చుకున్నారు. కేరళకు చెందిన జెఐ చాకో, జెడ్డాలోని ఓ పార్మాస్యూటికల్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఐదేళ్ళుగా తాను ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నానని చాకో చెప్పారు. ఐదేళ్ళుగా చాకో మిలియనియం డ్రాలో పాల్గొంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా, దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ రపాలెలో మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది. 48 ఏళ్ళ కువైటీ జాతీయుడు నవాఫ్‌ మొహమ్మద్‌ అల్నాజ్దీ బెంట్లే కాంటినెంటల్‌ ఫ్లైయింగ్‌ స్పెర్‌ గెల్చుకున్నారు. దుబాయ్‌లో స్థిరపడ్డ భారత జాతీయుడు కారుప్పన్‌ చెల్లయ్య ఫ్రెడ్రిక్‌ రేంజ్‌ రోవర్‌ హెచ్‌ఎస్‌ఇ కారుని గెల్చుకున్నారు. మరో కేరళ వాసి పుష్పరాజ్‌ మునియూర్‌ బిఎండబ్ల్యు ఎస్‌ 1000 ఆర్‌ఆర్‌ మోటర్‌ బైక్‌ని గెల్చుకున్నారు. పాకిస్తానా జతీయుడు మరూఫ్‌ సుమ్రో బిఎండబ్ల్యు ఎస్‌ 1000 ఆర్‌ మోటార్‌ బైక్‌ని గెల్చుకున్నారు.

 

Back to Top