బహ్రెయిన్:14,000 బహ్రెయినీ దినార్స్‌ మోసం

బహ్రెయిన్:14,000 బహ్రెయినీ దినార్స్‌ మోసం

బహ్రెయిన్:46 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు పౌరుల్ని మోసం చేశాడు. హై క్రిమినల్‌ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి 7,000 అలాగే 7,250 బహ్రెయినీ దినార్స్‌ను నిందితుడు వసూలు చేశాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు. 

Back to Top