వాజ్‌పేయి పార్థివ దేహం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలింపు

- August 16, 2018 , by Maagulf
వాజ్‌పేయి పార్థివ దేహం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలింపు

ఢిల్లీ:మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి పార్థివ దేహాన్ని కృష్ణ మీనన్‌ మార్గ్‌ నివాసం నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఉంచారు. దీంతో అభిమానులు బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల బీజేపీ నేతలు ఢిల్లీ చేరుకొని వాజ్‌పేయి కి నివాళి అర్పిస్తున్నారు. కాగా అటల్ జీ.. ఇక లేరన్న వార్త యావత్ భారతప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిలావుంటే బీజేపీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వాజ్‌పేయి పార్థివదేహం సందర్శనకు అనుమతిస్తారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. యమునానది ఒడ్డున అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌ఘాట్‌ సమీపంలో యమునానది ఒడ్డునే రాష్ట్రీయ స్మృతిస్థల్‌ కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com