ప్రభుత్వ లాంఛనాలతో వాజపేయి అంత్యక్రియలు పూర్తి

- August 17, 2018 , by Maagulf
ప్రభుత్వ లాంఛనాలతో వాజపేయి అంత్యక్రియలు పూర్తి

ఢిల్లీ:మహా మనిషి మళ్లి రా.. అటల్‌ జీ అమర్‌ రహే.. అంటూ జననేతకు కన్నీటి వీడ్కోలు పలికింది యావత్‌ భారత‌ దేశం. మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహరీ వాజ్‌పేయి ఇక తిరిగి రారనే విషయాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. అందుకే వేలాది మంది అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియులు ముగిసాయి.త్రివిధ దళాది పతుల గౌరవ వందనం తరువాత.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తుది వీడ్కోలు పలికారు. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో.. దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ నేతలు.. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తల మధ్య అంత్యక్రియులు ముగిసాయి…

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సీనియర్‌ నేత ఎల్‌కే అద్వాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్రంమంత్రులు, వివిధ పార్టీల నేతలు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విదేశీ మంత్రులు అంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు..

భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళులు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభమైన అంతిమయాత్రం.. 5 గంటలకు ముగిసింది. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి.. రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వరకు అంతియయాత్రలో దారి పొడవునా అటల్‌ జీ అమర్‌ రహే నినాదాలతో మార్మోగిపోయింది. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది.

మోడీకి ఆయన రాజకీయ మార్గదర్శి. అందుకే గురువుగా గౌరవించేవాడు..సోదరుడిలా అభిమానించేవాడు. దివంగత మాజీ ప్రధాని అటల్ జీతో మోడీకి ఉన్న అనుబంధం అది. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు నరేంద్ర మోడీ ఎదుగుదలలో వాజ్ పేయి ప్రభావం ఉంది. ఆయన ప్రొత్సహాం ఉంది. అందుకే వాజ్ పేయి పట్ల ఎల్లప్పుడూ భక్తుడిగా ఉండిపోయాడు మోడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com