నల్ల నువ్వుల్లో వుండే పోషకాలు

- August 19, 2018 , by Maagulf
నల్ల నువ్వుల్లో వుండే పోషకాలు

నువ్వులు ఆరోగ్యానికి మంచిదన్న విషయం మనందరికి తెలిసిందే. అందులోనూ నల్లనువ్వులు మరీ మంచివి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి వృద్దాప్యంలో వచ్చే అనేక సమస్యల్ని అడ్డుకుంటాయని హార్వార్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనల్లో తేలింది. మరి దీనిలోని పోషకాలేంటో తెలుసుకుందాం.

1. చాలామందికి విటమిన్-బి, ఐరన్ లోపం కారణంగానే జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంటుంది. ఇవి రెండూ నల్ల నువ్వుల్లో పుష్కలంగా దొరుకుతాయి. వీటిల్లోని విటమిన్-ఇ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
 
2. నల్ల నువ్వులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయట. వీటిలోని పీచు పదార్థం పేగు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. నువ్వుల్లోని సిసేమిన్ కాలేయం దెబ్బ తినకుండా కాపాడుతుంది.
 
3. నల్ల నువ్వుల్లో అధికంగా ఉండే పీచూ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి అంటున్నారు భారతీయ వైద్యులు. వీటిల్లోని నూనె పేగు పొడిబారిపోకుండా చేస్తుందట. వీటిని రుబ్బి లేదా నానబెట్టి తీసుకోవడం వల్ల పేగులోని నులిపురుగులని బయటకు పంపించడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడతాయి.
 
4. వీటిల్లో అధికంగా ఉండే మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది. కొలస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది.
 
5. సాధారణంగా ఆడవారిలో ముప్పై ఐదేళ్లు పైబడ్డాక ఎముక బరువు క్రమంగా తగ్గుతుంది. మెనోపాజ్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే నల్లనువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. నల్ల నువ్వులు పాలిచ్చే తల్లులకు ఎంతో మంచివి అంటున్నారు నిపుణులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com