"బక్రీద్" పండుగ:స్పెషల్ స్టోరీ

- August 20, 2018 , by Maagulf

"ఈదుల్ జుహా" అనేది మనిషి యొక్క త్యాగ నిరతిని చాటిచెప్పే పండుగ. ఈ పండుగనే ’బక్రీద్’ అంటారు. బక్రీద్ అనే పేరు ఈ పండుగను ఎలా జరుపుకుంటారనేందుకు ఓ కథ ప్రచారంలో ఉంది. మహమ్మదీయుడు హజ్రత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లా కనిపించి "నీ కుమారుని నాకు బలి ఇవ్వమ"ని కోరుతాడు.

నిద్ర నుంచి మేల్కొన్న ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌కు ఈ సంగతి తెలియజేయడంతో, దైవ భక్తుడైన ఇస్మాయిల్ తాను బలవడానికి సిద్ధమేనని చెబుతాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం దేవునికి గొర్రెను సమర్పించినందుకు గుర్తుగా ముస్లిం సోదరులు బక్రీద్ (బక్రా అనగా గొర్రె) పండుగను జరుపుకుంటున్నారు. 

బక్రీద్ పండుగను పురస్కరించుకుని పండుగకు ముందురోజున మరణించిన వారి గోరీల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా ఉంచితే వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని విశ్వసిస్తారు. ఈ పండుగ సందర్భంగా ధనికులు పొట్టేలు మాంసాన్ని పేదలందరికీ ’కుర్బానీ’ అనే పేరుతో పంచటం ఆనవాయితీ. 

మరీ ధనవంతులు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అతి పవిత్రమైన మక్కాను సందర్శిస్తారు. మరి ముస్లిం సోదరులందరికీ "ఈద్ ముబారక్" అంటూ మనమూ శుభాకాంక్షలు తెలియజేద్దామా..!.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com