రాత్రి భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి...

- September 02, 2018 , by Maagulf
రాత్రి భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి...

జ్ఞాపకశక్తి అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. ఇటీవల కాలంలోమనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, లోపం వలన మనం అనేక మందులను వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇలా మందులను వాడేకంటే మన పెరటిలో ఉండే ఉసిరికాయ వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య విలువలు, ఔషధ లక్షణాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. పుల్లపుల్లగా వగరుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయి. యాపిల్‌తో పోలిస్తే ఇందులో మూడురెట్లు ప్రోటీన్లు ఉన్నాయి.

దానిమ్మ పండుతో పోలిస్తే దాదాపు 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరిలో యాంటీవైరల్, యాంటీవైరల్, యాంటీమాక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాయ రక్తప్రసరణను మెరుగు పరిచి శరీరంలో అధికంగా పేరుకుపోయిన క్రొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. లైంగిక సామర్ధ్యం పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్రను పోషిస్తుంది.
 
అలసటను దూరం చేస్తుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా కాపాడుతుంది. మెదడు పనితీరు మెరుగు పరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి శరీరానికి మేలు చేస్తుంది. జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది. చుండ్రు కేశ సంబంధిత అనేక సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
ఉసిరిని తీసుకోవడం వల్ల చర్మంపై మచ్చలను, వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలను నివారించుకోవచ్చు. ఉసిరిని ముద్దగా నూరి అందులో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె కలిపి శరీరానికి పట్టించి స్నానం చేయడం వల్ల చర్మం సహజ సౌందర్యంతో మిలమిల మెరుస్తూ ఉంటుంది. 
 
రాత్రి భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి తీసుకుంటే ఎసిడిటీ లేదా కడుపుమంట నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ప్రతిరోజు ఉసిరి రసం లేదా ఉసిరి పొడిని తీసుకోవడం ద్వారా రక్తశుద్ది జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com