వేపాకుల కాషాయం వలన ఉపయోగాలు...

- September 12, 2018 , by Maagulf
వేపాకుల కాషాయం వలన ఉపయోగాలు...

వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. కాలేయం, మూత్రపిండాల నుండి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపుటకు వేపాకు మంచిగా సహాయపడుతాయి. ప్రతిరోజూ వేప కషాయాన్ని తీసుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. 

ఈ వేప కషాయం తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర నిల్వలు, హైబీపీ వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. తద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే వేప ఆకుల రసాన్ని పుక్కిలించితే దంతాలు సున్నితంగా మారుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com