స్కై డైవింగ్‌ వరల్డ్‌ కప్‌ని నిర్వహించనున్న బహ్రెయిన్‌

స్కై డైవింగ్‌ వరల్డ్‌ కప్‌ని నిర్వహించనున్న బహ్రెయిన్‌

బహ్రెయిన్‌లోని గ్రావిటీ విలేజ్‌ మూడవ ఎఫ్‌ఎఐ - వరల్డ్‌ ఎయిర్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ వరల్డ్‌ కప్‌ ఆఫ్‌ ఇండోర్‌ స్కై డైవింగ్‌ 2018కి వేదిక కానుంది. అక్టోబర్‌ 25 నుంచి 28 వరకు ఈ ఈవెంట్‌ జరుగుతుంది. మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ ఇండోర్‌ స్కై డైవింగ్‌ అథ్లెట్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. విజేతలకు 200,000 డాలర్స్‌ బహుమతిని అందిస్తారు. మార్కెటింగ్‌ మేనేజర్‌ ఆఫ్‌ గ్రావిటీ ఇండోర్‌ స్కై డైవింగ్‌ మరిమ్‌ ఫాతి మాట్లాడుతూ, బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌ గతంలో పలు ఇండోర్‌ స్కై డైవింగ్‌ కాంపిటీషన్స్‌ని నిర్వహించిందని చెప్పారు. అయితే ఎఫ్‌ఎఐ వరల్డ్‌ కప్‌ ఆఫ్‌ ఇండోర్‌ స్కై డైవింగ్‌ పోటీల్ని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులతో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని చెప్పారు మరియమ్‌ ఫాతి. 100 టీమ్‌లు 25 దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.

Back to Top