ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చిన ఒమనీ మహిళ

ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చిన ఒమనీ మహిళ

మస్కట్‌: ఓ ఒమనీ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. రాయల్‌ హాస్పిటల్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే పుట్టినవారిలో ఓ చిన్నారి మృతి చెందడం జరిగింది. గత నెలలో ఈద్‌ సెలవు రోజున ఐదుగురు చిన్నారులు జన్మించారు. వీరిలో నలుగురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శస్త్ర చికిత్స (సిజేరియన్‌) ద్వారా ఐదుగురు పిల్లల్ని ఆమె గర్భం నుంచి బయటకు తీశారు. అయితే వెంటనే ఓ చిన్నారి మృతి చెందిందని రాయల్‌ హాస్పిటల్‌ వైద్యులు చెప్పారు. కిలో నుంచి 1.2 కిలోగ్రాముల బరువు మాత్రమే చిన్నారులు వున్నారనీ, నెల రోజులపాటు ఇన్‌క్యుబేటర్‌లో వుంచిన తర్వాత 1.5 కిలోల బరువుకి చేరుకున్నారని వైద్యులు వెల్లడించారు. వీరంతా ప్రి మెచ్యూర్‌ బేబీస్‌ అని వైద్యులు చెప్పారు. 

Back to Top