దుబాయ్‌ చేరుకున్న భారత క్రికెట్ టీం

దుబాయ్‌ చేరుకున్న భారత క్రికెట్ టీం

దుబాయ్‌: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ కోసం రోహిత్‌ శర్మ నాయకత్వంలోని భారత జట్టు దుబాయ్‌ చేరుకుంది. రేపటి నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌, ఆఫ్గానిస్థాన్‌ జట్లు ఈ టోర్నీలో పాల్గంటున్నాయి.

టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ, బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కేదార్‌ జాదవ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు గురువారం దుబాయ్‌ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు విమానంలో సహచర ఆటగాళ్లతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. దుబాయ్‌ చేరుకున్న భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం దక్కింది. సంప్రదాయ పద్ధతిలో నిర్వాహకులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితిక కూడా దుబాయ్‌ పర్యటనకు వెళ్లింది.

ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి వచ్చిన ఆటగాళ్లు ఆదివారం ఈ టోర్నీ కోసం దుబాయ్‌ వెళ్లనున్నారు. టోర్నీలో భాగంగా భారత్‌ 18న హాంకాంగ్‌తో, 19తో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

Back to Top