పగిలిన మెయిన్‌ వాటర్‌ పైప్‌ లైన్‌

పగిలిన మెయిన్‌ వాటర్‌ పైప్‌ లైన్‌

మస్కట్‌: విలాయత్‌ ఆఫ్‌ ఇబ్రి మరియు విలాయత్‌ ఆఫ్‌ యాంకుల్‌ మధ్య వాటర్‌ డిస్ట్రిబ్యూషన్‌ పైప్‌లైన్‌ పగిలినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ (డియామ్‌) వెల్లడించింది. వాటర్‌ పైప్‌లైన్‌ పగలడానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు. 24 గంటల్లో దీన్ని రిపెయిర్‌ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పనులు ప్రారంభించామనీ, వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుతామనీ, పైప్‌లైన్‌ పగిలిన విషయాన్ని వెల్లడిస్తూ డియామ్‌ ఆన్‌లైన్‌లో ప్రజలనుద్దేశించి పేర్కొంది. 

Back to Top