ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘనకి ఎల్లో కార్డ్‌

ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘనకి ఎల్లో కార్డ్‌

స్కూల్‌ ప్రాంతాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే అబుదాబీ పోలీస్‌, వాహనదారులకు ఎల్లో కార్డ్స్‌ని హెచ్చరికలా జారీ చేయబోతున్నారు. సోసల్‌ మీడియా ద్వారా 'లెట్‌ అస్‌ క్రాస్‌' ఇనీషియేటివ్‌ పేరుతో ఈ హెచ్చరిను జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్‌ సేఫ్టీ రూల్స్‌ని పాటించడం తాలూకు ప్రాముఖ్యతను గురించి అబుదాబీ పోలీస్‌ - సెంట్రల్‌ ఆపరేషన్స్‌ సెక్టార్‌ - ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టరేట్‌ మరోమారు పునరుద్ఘాటించింది. టిక్కెట్స్‌, యెల్లో కార్డ్స్‌ని వాహనదారులకు ఫ్రెండ్లీ రిమైండర్స్‌గా జారీ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎల్లో కార్డ్స్‌ ఫస్ట్‌ డిగ్రీ కాకపోయినా, బాధ్యతాయుతంగా వారు వాహనాలు నడిపేందుకు ఉపకరిస్తుందని అబుదాబీ పోలీస్‌, ట్రాఫిక్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ కల్నల్‌ అహ్మద్‌ ఖాదెమ్‌ అల్‌ కుబైసి చెప్పారు. 

 

Back to Top