పోలీస్‌ అధికారితో తలపడనున్న బహ్రెయినీ అథ్లెట్‌

పోలీస్‌ అధికారితో తలపడనున్న బహ్రెయినీ అథ్లెట్‌

మనామా: బహ్రెయినీ అథ్లెట్‌ హమ్జా కూహెజి, ఫిలిప్పైన్స్‌ వెటరన్‌ పోలీస్‌ అధికారి క్రిసాంటో పిటపిటంగ్‌తో తలపడనున్నారు. సెప్టెంబర్‌ 21న యూఏఈలోని అబుదాబీలో ముబాదలా ఎరీనాలో జరుగనున్న రబేవ్‌ 16లో ఈ పోటీ జరుగుతుంది. బహ్రెయినీ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్టిస్ట్‌, కంబాట్‌ సిట్యుయేషన్స్‌లో ప్రొఫెషనల్లీ ట్రైన్డ్‌ అయిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్టిస్ట్‌తో పోటీ పడుతుండడం ఇదే తొలిసారి. బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌తో సైన్‌ అయిన తొలి ఫిలిప్పీన్స్‌ ఫైటర్‌గా పిటిపిటంగ్‌ రికార్డులకెక్కారు. చిన్న గాయం కారణంగా కాస్త ఆలస్యంగా ఈ పోటీల్లోకి ఆయన ప్రవేశిస్తున్నారు. బహ్రెయినీ ఫైటర్స్‌తో అతనికిది చాలా కష్టమైన ఫైట్‌ అని అంచనా వేస్తున్నారు. హమ్జా కూహెజి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో అత్యంత ప్రావీణ్యం వున్న వ్యక్తి. ఇండోనేసియాలో బ్రేవ్‌ 12 తర్వాత అస్సలేమాత్రం రెస్ట్‌ తీసుకోలేదనీ, ప్రతిరోజూ ట్రైనింగ్‌ కొనసాగిస్తూ వచ్చానని, బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌ కోసం తాను పోరాడుతున్నానని, ఇది తనకు చాలా ఆనందంగా వుందని విజయం సాధించి కింగ్‌డమ్‌కి ఆ విజయాన్ని బహుమతిగా ఇస్తానని కూహెజి చెప్పారు. 

Back to Top