వాడిలో పడిపోయిన మహిళను రక్షించిన పిఎసిడిఎ

వాడిలో పడిపోయిన మహిళను రక్షించిన పిఎసిడిఎ

మస్కట్‌: షర్కియాలోని వాడి షాబ్‌లో పడిపోయిన ఓ మహిళను పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ వర్గాలు రక్షించాయి. బాధిత మహిళకు తక్షణ వైద్యం అందించిన తర్వాత ఆమెను సుర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పిఎసిడిఎ, ఆన్‌లైన్‌ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. బాధిత మహిళను ఆసియా జాతీయురాలిగా గుర్తించారు. సమాచారం అందగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయం అందించి, మహిళను రక్షించామని పిఎసిడిఎ పేర్కొంది. 

 

Back to Top