కార్‌ డ్రిఫ్టింగ్‌: ఒకరి అరెస్ట్‌

కార్‌ డ్రిఫ్టింగ్‌: ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: కార్‌ డ్రిఫ్టింగ్‌ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ (ఆర్‌ఓపి) పేర్కొంది. విలాయత్‌ ఆఫ్‌ రుస్తాక్‌లో నిందితుడు, కార్‌ డ్రిఫ్టింగ్‌కి పాల్పడ్డాడు. నార్త్‌ బతినా పోలీస్‌ ఫోర్స్‌, ఓ వాహన డ్రైవర్‌ని అరెస్ట్‌ చేశారనీ, భయభ్రాంతులకు గురిచేసేలా కార్‌ డ్రిఫ్టింగ్‌కి నిందితుడు పాల్పడ్డాడనీ, ఈ ఘటన విలాయత్‌ ఆఫ్‌ రుస్తాక్‌లో జరిగిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు.

Back to Top